తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) గెలిచిన కాంగ్రెస్ (Congress) ... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అధికారాన్ని కోల్పోయిన BRS... పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించింది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. అయితే ఎన్నికల ముందు పార్టీలో హడావిడి చేసిన ఒకరిద్దరు నేతలు... ఇప్పుడు కనిపించకపోవడం గులాబీ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. Adilabad Railway line : ఆదిలాబాద్ రైల్వే లైన్ వెనక రాజకీయం ! తొమ్మిదిన్నర ఏళ్ళు BRS సర్కార్ హయాంలో ఒక రేంజ్‌లో హడావిడి చేసిన వాళ్ళు...ఇప్పుడు యాక్షన్‌లో మిస్ కావడం ఏంటని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కుర్మయ్య గారి నవీన్ కుమార్ ఎన్నికయ్యారు. పార్టీ పెద్దలకు ఆయన అత్యంత సన్నిహితుడన్న టాక్ అప్పట్లో ఉండేది. గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) కు సంబంధించిన వరకు నవీన్ కుమార్ మాట బాగా చెల్లుబాటు అయ్యిందని అంటారు. ఇటు గ్రేటర్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా... నవీన్ కుమార్ తీరుపై గుర్రుగా ఉన్నారన్నట. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఆ ఎమ్మెల్సీ పెద్దగా కనిపించకుండా పోవడం... గులాబీ పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అధికారంలో ఉన్నప్పుడు పెద్దల చుట్టూ తిరిగిన నవీన్ కుమార్... ఇప్పుడు మిస్ అయ్యారా అన్న ప్రచారం జరుగుతోంది. Krishna District TDP vs Janasena : కృష్ణా జిల్లాలో జనసేన, టీడీపీ సిగపట్లు ! కొద్ది రోజుల క్రితం శాసనమండలిలో సిఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన రియల్ ఎస్టేట్ కామెంట్స్... ఎమ్మెల్సీ నవీన్ కుమార్‌ను ఉద్దేశించి చేసినవేనని... ఆ పార్టీలోని ఒక వర్గం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్ చుట్టూ పక్కల భూముల వ్యవహారాల్లో నవీన్ కుమార్ కీలక పాత్ర పోషించారన్న చర్చ కూడా ఉంది. కాంగ్రెస్ సర్కార్ రావడంతో నవీన్ కుమార్ (Naveen Kumar) జాగ్రత్త పడే పనిలో ఉన్నారా అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే ఎమ్మెల్సీలతో కేటీఆర్ నిర్వహించిన సమావేశానికి నవీన్ కుమార్ హాజరయ్యారు. మొత్తంగా గులాబీ పార్టీలో ఈ MLC గురించి రకరకాలుగా చర్చలు మొదలు అయ్యాయ్యట. మరి ఆ MLC తనపై వచ్చే కామెంట్స్ ను ఎలా తిప్పి కొడతారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.